: ఆర్థిక శాస్త్రంలో ఆంగస్ డేటన్ కు నోబెల్ పురస్కారం


ఆర్థిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం ప్రకటించారు. 2015 సంవత్సరానికిగానూ అమెరికా ఆర్థికవేత్త ఆంగస్ డేటన్ కు నోబెల్ పురస్కారం ప్రకటించారు. వినియోగం, పేదరికం, సంక్షేమం అంశాలపై చేసిన అధ్యయనానికి గాను ఆయనకు ఈ పురస్కారం దక్కింది. స్థూల అర్థశాస్త్రం, సూక్ష్మ అర్థశాస్త్రం విభాగాల రూపాంతరానికి ఆయన చేసిన కృషి ఎంతగానో సహాయ పడింది. లండన్ లో జన్మించిన డేటన్ ప్రస్తుతం అమెరికాలోని ప్రిన్స్ టన్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. ఆర్థిక శాస్త్రానికి సంబంధించి ఈయన పుస్తకాలు కూడా రాశారు.

  • Loading...

More Telugu News