: కాంగ్రెస్ వ్యాపార వేత్తకు శివసేన బెదరింపులు


కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, వ్యాపార వేత్త అయిన తెహసీన్ పూనావాలాకు శివసేన పార్టీ నుంచి బెదరింపులు వచ్చాయి. పాకిస్థాన్ లో ఫుడ్ ఫెస్టివల్ ఒకటి నిర్వహించే ప్రయత్నాలలో ఉన్న పూనావాలాకు ఫేస్ బుక్ ద్వారా బెదరింపు సందేశం అందింది. ఆ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించడానికి వీలు లేదంటూ ఆ సందేశంలో పేర్కొన్నారు. శివసేన పుణె అధ్యక్షుడు అజయ్ భోంస్లే ఫేస్ బుక్ ఖాతా నుంచి ఈ బెదరింపు సమాచారం వచ్చినట్లు బాధితుడు తెలిపాడు. కాగా, పాకిస్థాన్ మాజీ మంత్రి కసూరి పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని నిరసిస్తూ సోమవారం ఉదయం శివసేన కార్యకర్తలు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ సంఘటన జరిగిన కొద్ది గంటలకే పూనావాలాకు బెదరింపు సందేశం రావడం గమనార్హం.

  • Loading...

More Telugu News