: పీఓకే లో అరాచకాల సంగతి కాశ్మీరీలకు తెలియదు: మంత్రి మనోహర్ పారికర్


పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లో పాక్ సైన్యం అరాచకాల గురించి కాశ్మీరీ సోదరులకు తెలియదని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ అన్నారు. పీఓకే లో జరుగుతున్న ఘోరాలకు అంతులేకుండా పోతోందని, వాటి గురించి కాశ్మీరీ సోదరులకు తెలియజెప్పాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఈ విషయాలన్నీ తెలిస్తే పాకిస్థాన్ ను తలచుకోవాలన్నా వారు భయపడతారన్నారు. అక్కడి ప్రముఖ నగరం పెషావర్ లో సైనిక స్థావరానికి దగ్గర్లోనే వందలాది విద్యార్థులు దారుణంగా హత్యకు గురయ్యారని, ప్రార్థనల కోసం మసీదులకు వెళుతున్న వారు అన్యాయంగా తమ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని పారికర్ ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News