: ‘దసరా’ సీజన్ .. డబుల్ డెక్కర్ ప్రత్యేక రైళ్లు
దసరా పండగ రద్దీ దృష్ట్యా డబుల్ డెక్కర్ ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. కాచిగూడ-గుంటూరు మధ్య ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ రైళ్లన్నీ ఖాజీపేట, విజయవాడ మార్గంలో నడుస్తాయి. ఈ నెల 16,18,20,22,24,25 తేదీల్లో రాత్రి పదకొండు గంటలకు కాచిగూడ నుంచి, ఈ నెల 17,19,21,23,25 తేదీల్లో రాత్రి 11 గంటలకు గుంటూరు నుంచి ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నట్లు రైల్వే అధికారులు వివరించారు.