: ప్రశాంతంగా బీహార్ తొలి దశ ఎన్నిక... 2 గంటల వరకు 43.42 శాతం పోలింగ్
బీహార్ రాష్ట్ర తొలి దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. 49 నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఉత్సాహంగా ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు. ఈ మధ్యాహ్నం 2 గంటల సమయానికి 43.42 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. అడిషనల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆర్ లక్ష్మణన్ మాట్లాడుతూ, ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని చెప్పారు. ఇంతవరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నట్టు తమకు సమాచారం లేదన్నారు.