: దొంగ లెక్కలు, మోసపూరిత హామీల ప్రభుత్వం ఇది!: అంబటి రాంబాబు


దొంగ లెక్కలు, మోసపూరిత హామీలు చంద్రబాబు ప్రభుత్వానివేనని వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబు మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు లాగా వైఎస్ జగన్ కుటుంబం దొంగ పనులు చేయలేదన్నారు. జగన్ ది దొంగదీక్ష అని మంత్రులు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. తప్పుడు ఆరోపణలు చేయడం మానకపోతే ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి కామినేని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ ఆయన మండిపడ్డారు. జగన్ కు రక్త పరీక్షలు ఎప్పుడు చేస్తున్నారో కామినేనికి తెలుసా? అని ప్రశ్నించారు. గుంటూరు జీజీహెచ్ లో వైద్య పరికరాలు లేకపోవడంతో ప్రైవేట్ పరీక్ష కేంద్రాల్లో టెస్ట్ లు నిర్వహించాల్సి వస్తోందంటే ఆంధ్రా సర్కార్ పాలన ఏ విధంగా ఉందో ప్రజలకు అర్థమవుతుందని అంబటి విమర్శించారు.

  • Loading...

More Telugu News