: సాహిత్యకారులు బూటకపు ప్రకటనలు మానుకోవాలి: వీహెచ్ పీ నేత సురేంద్ర జైన్
సాహిత్యకారులు బూటకపు ప్రకటనలు ఇవ్వడం మానుకోవాలని వీహెచ్ పీ నేత సురేంద్ర జైన్ సూచించారు. లక్నోలో ఆయన మాట్లాడుతూ, సౌదీ అరేబియా వెళ్లి పంది మాంసం గురించి మాట్లాడగలరా? అని ప్రశ్నించారు. అలా ఎవరైనా మాట్లాడి, ధైర్యంగా తిరిగి వస్తే వారికి తానే స్వాగతం పలుకుతానని ఆయన చెప్పారు. దేశ జనాభాలో మూడింట రెండు వంతుల జనాభా మాంసాహారం తింటారని, వారు ఏం తినాలో తాము చెప్పడం లేదని ఆయన తెలిపారు. అయితే తమ మనోభావాలు దెబ్బతీయ వద్దని చెబుతున్నామని ఆయన పేర్కొన్నారు. కేవలం గోమాంసంపైనే నిషేధం విధించాలని కోరుతున్నామని ఆయన తెలిపారు.