: జగన్ దీక్షలో స్పష్టత లేదంటున్న మంత్రి బొజ్జల


ప్రత్యేక హోదా కోసం గత ఆరో రోజులుగా దీక్ష చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీక్షలో స్పష్టత లేదని మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కావాలని ఆయన కేంద్రాన్ని అడుగుతున్నారా? లేక రాష్ట్రాన్ని అడుగుతున్నారా? అని ప్రశ్నించారు. కేంద్రాన్ని అడిగితే జగన్ తన దీక్షను ఢిల్లీలో చేయాలని బొజ్జల సూచించారు. అనంతపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రభుత్వం తరపున జగన్ కు వైద్య పరీక్షలు నిర్వహించి హెల్త్ బులెటిన్ విడుదల చేశామని, అయినా వారు ప్రైవేటు వైద్యులను నియమించుకుని హంగామా చేస్తున్నారని విమర్శించారు.

  • Loading...

More Telugu News