: విశాఖ మన్యంలో బంద్ కు పిలుపునిచ్చిన మావోలు


విశాఖ మన్యంలో 48 గంటల బంద్ కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. బాక్సైట్ తవ్వకాల అనుమతికి వ్యతిరేకంగా మావోలు ఈ బంద్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముగ్గురు టీడీపీ నేతలను ఈ నెల 6న కిడ్నాప్ చేసిన మావోలు... మూడు రోజుల కిందట ఓ లేఖ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 12, 13 తేదీల్లో బంద్ చేయనున్నట్టు ఆ లేఖలో తెలిపారు. అంతేగాక నేడు విశాఖకు వస్తున్న సీఎం చంద్రబాబును బాక్సైట్ పై నిలదీయాలని కూడా డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బాక్సైట్ తవ్వకాలు చేపట్టబోమని రెండు రోజుల్లోగా ప్రభుత్వం ప్రకటన చేయాలని మావోయిస్టు ఈస్ట్ డివిజన్ కమిటీ సభ్యుడు రమణ డిమాండ్ చేశారు. ఈ మేరకు నేడు కూడా మీడియా కార్యాలయాలకు మావోలు లేఖ పంపించారు. ఇలా ప్రకటన చేయని పక్షంలో తమ వద్ద బందీలుగా ఉన్న టీడీపీ నేతలపై తీసుకునే చర్యలకు ప్రభుత్వానిదే బాధ్యతని లేఖలో హెచ్చరించారు. పోలీసులు కూంబింగ్ ను నిలిపివేయాలని కూడా కోరారు.

  • Loading...

More Telugu News