: కాసేపట్లో బీహార్ లో 49 నియోజకవర్గాల్లో తొలివిడత ఎన్నికలు
కాసేపట్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. బీహార్ ఎన్నికలకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భారీ స్థాయిలో పోలీసులను మోహరించారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకున్నారు. బ్యాలెట్ బాక్సులు త్వరగా చేర్చేందుకు చర్యలు తీసుకున్నారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు హెలీకాప్టర్లను వినియోగించనున్నారు. మొత్తం 49 స్థానాలకు జరిగే ఈ తొలి విడత ఎన్నికల్లో 80,000 నుంచి 90,000 మంది విధులు నిర్వర్తించనున్నారు. వివిధ పార్టీలకు చెందిన 583 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. తొలి విడత ఎన్నికల్లో కోటీ 35 లక్షల 72 వేలకు పైగా ఓటర్లు ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకోనున్నారు.