: డచ్ ఓపెన్ టోర్నీలో భారత షట్లర్ అజయ్ విజయం
డచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో పురుషుల సింగిల్స్ ఫైనల్స్ మ్యాచ్ లో భారత షట్లర్ అజయ్ జయరాం విజయకేతనం ఎగురవేశాడు. నెదర్లాండ్స్ లోని ఆర్మెరిలో జరిగిన డచ్ ఓపెన్ లో ఎస్టోనియా క్రీడాకారుడు ర్యూల్ ముస్ట్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో అజయ్ తలపడ్డాడు. 21-12,21-18 వరుస సెట్ల తేడాతో అజయ్ గెలిచాడు. మూడో సీడ్ గా బరిలోకి దిగిన అజయ్ వరుస సెట్లలో 12 సీడ్ ఆటగాడిని ఓడించి డచ్ ఓపెన్ టోర్నీని సొంతం చేసుకున్నాడు.