: ప్రఖ్యాత ఫుట్ బాల్ ప్లేయర్ పీలేకు ఘనస్వాగతం


ప్రపంచ ప్రఖ్యాత ఫుట్ బాల్ క్రీడాకారుడు పీలేకు కోల్ కతాలో ఘన స్వాగతం లభించింది. భారత మాజీ ఫుట్ బాల్ ఆటగాడు గోస్వామి ఆయనకు సాదర స్వాగతం పలికారు. సోమవారం నుంచి పీలే కోల్ కతా పర్యటన ప్రారంభమవుతుందని అధికారులు వెల్లడించారు. మూడురోజుల పాటు ఆయన పర్యటన ఉంటుంది. పీలేను నేతాజీ క్రికెట్ స్టేడియంలో ఘనంగా సన్మానించనున్నారు. ఈ కార్యక్రమానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, భారత క్రికెట్ మాజీ కెప్టెన్ గంగూలి, సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహ్మన్ హాజరుకానున్నారు. పలు ప్రత్యేక వంటకాలతో పీలేకు విందు ఇవ్వనున్నారు. సుమారు 38 ఏళ్ల తర్వాత మనదేశానికి పీలే రావడంపై ఫుట్ బాల్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పీలేను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు కోల్ కతాకు తరలివచ్చారు.

  • Loading...

More Telugu News