: జగన్ ఆరోగ్య పరిస్థితిని ప్రభుత్వం గమనిస్తోంది: మంత్రి కామినేని


వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోగ్య పరిస్థితిని ప్రభుత్వం ఎప్పటికప్పుడు గమనిస్తోందని ఏపీ వైద్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు వైద్యులతో మాట్లాడేందుకు గుంటూరు వచ్చినట్లు మంత్రి చెప్పారు. ఒక్కసారిగా చక్కెర శాతం 59కి తగ్గి 83కు పెరగడంపై పరిశీలిస్తున్నామన్నారు. వైద్యులు ఇచ్చిన ఆరోగ్య పరీక్షల వివరాలను పరిశీలించినట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష ఐదవ రోజుకు చేరుకుంది.

  • Loading...

More Telugu News