: 41 ఓవర్లకు 200 పరుగులు... మందగించిన పరుగుల వేగం
సఫారీల పరుగుల వేగం మందగించింది. ఫ్రీడమ్ సిరీస్ లో భాగంగా నేటి ఉదయం కాన్పూర్ లో మొదలైన వన్డే మ్యాచ్ లో టాస్ నెగ్గిన సఫారీ కెప్టెన్ డివిలియర్స్ ఫస్ట్ బ్యాటింగ్ ను ఎంచుకున్నాడు. టీమిండియా సీమర్లను తొలుత కాస్తంత దీటుగానే ఎదుర్కొన్న సఫారీ బ్యాట్స్ మెన్, స్పిన్నర్లు రంగ ప్రవేశం చేయగానే వేగం తగ్గించక తప్పలేదు. పది ఓవర్ల దాకా 5 మేర రన్ రేటును కొనసాగించిన సఫారీలు ఆ తర్వాత రన్ రేటును 5కు చేర్చేందుకు నానా తంటాలు పడ్డా ఫలితం దక్కలేదు. 41 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేస్తే కాని సఫారీల స్కోరు 200 మార్కును తాకలేకపోయింది. అంతేకాక అప్పటికే సఫారీ స్టార్ బ్యాట్స్ మెన్లలో నలుగురు కీలక ప్లేయర్లు పెవిలియన్ చేరారు. 43 ఓవర్లు ముగిసే సరికి నాలుగు వికెట్ల నష్టానికి సఫారీలు 213 పరుగులు చేశారు. డివిలియర్స్ (58), డుమిని (6) పరుగులతో క్రీజులో ఉన్నారు.