: ఇందిరపై మోదీ విమర్శలు...దేశం గురించి పట్టించుకోకుండా ఎమర్జెన్సీ విధించారని ఆరోపణ


మాజీ ప్రధాని ఇందిరా గాంధీపై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించారు. లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ 113వ జయంతిని పురస్కరించుకుని నేటి ఉదయం ఢిల్లీలో నిర్వహించిన ‘లోక్ తాంత్రా రక్షా దివస్’ ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా మోదీ నాటి ఎమర్జెన్సీ రోజులను గుర్తు చేశారు. దేశం గురించి ఏమాత్రం పట్టించుకోకుండా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఎమర్జెన్సీని విధించారని ఆయన ఆరోపించారు. నాటి ఎమర్జెన్సీ కారణంగా దేశానికి భారీ నష్టం జరిగిందని మోదీ పేర్కొన్నారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా సంపూర్ణ విప్లవం నినాదంతో జేపీ ఇచ్చిన పిలుపునకు మీడియా కూడా సహకరించిందని మోదీ అన్నారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జేపీతో కలిసి పోరాడిన 14 మందిని మోదీ ఈ సందర్భంగా ప్రత్యేకంగా సన్మానించారు.

  • Loading...

More Telugu News