: వన్డేల్లోనూ ‘టాస్’ సఫారీలదే... బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా జట్టు
ఫ్రీడమ్ సిరీస్ లో ‘టాస్’ సఫారీ జట్టు వైపే మొగ్గుచూపుతోంది. సిరీస్ లో భాగంగా జరిగిన రెండు టీ20 మ్యాచ్ లలో టాస్ గెలిచిన డూ ప్లెసిస్, టీమిండియాను తొలి బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. రెండు మ్యాచ్ లలోనూ విజయం సాధించిన అతడు టీ20 టైటిల్ ను సులువుగానే ఎగరేసుకుపోయాడు. తాజాగా సఫారీల తరఫున టాస్ లో పాల్గొన్న ఆ జట్టు వన్డే కెప్టెన్ ఏబీ డివిలియర్స్ కూడా విజయం సాధించాడు. కాన్పూర్ లో మరికాసేపట్లో జరగనున్న వన్డేకు సంబంధించిన టాస్ లో డివిలియర్స్ నెగ్గాడు. అయితే డూ ప్లెసిస్ నిర్ణయానికి భిన్నంగా వ్యవహరించిన డివిలియర్స్ ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.