: సినిమా కంటే నా కుటుంబం ముఖ్యం: కల్యాణ్ రామ్


సినిమా కంటే ముందు తనకు తన కుటుంబమే ముఖ్యమని ప్రముఖ సినీ కథానాయకుడు కల్యాణ్ రామ్ చెప్పారు. హైదరాబాదులో 'షేర్' ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ, తన కుటుంబంలో వ్యక్తులను వేరు చేసి మాట్లాడవద్దని అభిమానులకు సూచించారు. తాతగారు తమ అందరికీ కల్పవృక్షమని, ఆయన నెలకొల్పిన సంప్రదాయంలో బాబాయ్, ఆ తరువాత తన తండ్రి, ఆ తరువాత తన సోదరుడు జూనియర్ ఎన్టీఆర్, తాను, తన సోదరులు వచ్చామని కల్యాణ్ రామ్ చెప్పారు. తమను వేరు చేసి మాట్లాడవద్దని, తామంతా ఓకే కుటుంబమని, ఆయన నెలకొల్పిన సంప్రదాయాన్ని తాము కొనసాగిస్తున్నామని, ఇందులో అందరం ఒకటేనని, తమదంతా నందమూరి కుటుంబమని కల్యాణ్ రామ్ చెప్పారు. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా, అభిమానులు కూడా తమ కుటుంబమేనని ఆయన పేర్కొన్నారు. అభిమానుల ఆదరణే తమ కుటుంబానికి అండ అని కల్యాణ్ రామ్ చెప్పారు. ఈ సినిమా అంగీకరించినప్పుడు మల్లి (దర్శకుడు)కి ఎందుకు మూడో సినిమా చేస్తున్నావని చాలా మంది అడిగారని, ఫెయిల్యూర్స్ జీవితంలో సర్వసాధారణమని, మల్లి జీవితానికి హిట్ చాలా అవసరమని, అందుకే తాను మల్లికి ఈ సినిమా చేశానని కల్యాణ్ రామ్ తెలిపాడు. ఈ సినిమా హిట్ అయితే ఇండస్ట్రీలో ఓ మంచి దర్శకుడు ఉంటారని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News