: హైదరాబాద్ లో మరో బ్యాడ్మింటన్ అకాడమీని ఏర్పాటు చేస్తున్న గోపీచంద్
హైదరాబాద్ లో మరో బ్యాడ్మింటన్ అకాడమీని ఏర్పాటు చేస్తున్నట్టు బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ తెలిపాడు. సైబరాబాద్ ఏరియాలోని గచ్చిబౌలిలో తొమ్మిది కోర్టులతో కూడిన బ్యాడ్మింటన్ అకాడమీని ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించాడు. వచ్చే రెండు నెలల్లో అకాడమీ ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుందని చెప్పాడు. కేంద్ర క్రీడామంత్రి సర్బానంద్ సోనావాల్, రాష్ట్ర సీఎం కేసీఆర్ లను ప్రారంభోత్సవానికి ఆహ్వానించనున్నట్టు గోపీచంద్ వివరించాడు. అయితే వారిచ్చిన సమయాన్ని బట్టి ఈ కార్యక్రమ తేదీని నిర్ణయిస్తామన్నాడు. బ్యాడ్మింటన్ శిక్షణ తీసుకునే వారి సంఖ్య పెరుగుతున్నందునే కొత్త అకాడమీని ఏర్పాటు చేయాలనుకుంటున్నట్టు చెప్పాడు.