: ప్రాంతాలు వేరైనా తెలుగువారంతా ఒక్కటే: బాలకృష్ణ
ప్రాంతాలు వేరైనా తెలుగువారంతా ఒక్కటేనని ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలిపారు. అనంతపురం జిల్లా హిందూపురంలో రెండో రోజు పర్యటించిన బాలయ్య, బిట్ ఇంజనీరింగ్ కళాశాలలో స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వామి వివేకానంద జీవితం అందరికీ ఆదర్శం కావాలని అన్నారు. వివేకానందుని బోధలతో అంతా స్పూర్తి పొందాలని ఆయన ఆకాంక్షించారు. అలాగే ఎందరో తెలుగు మహనీయులు పుట్టిన గడ్డ మన తెలుగు నేల అని, రాయలసీమ ప్రాంతం విశిష్టతలకు నిలయమని ఆయన తెలిపారు.