: గవర్నర్ ను అలైబలై కార్యక్రమానికి ఆహ్వానించిన దత్తాత్రేయ
ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ను కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ రాజ్ భవన్ లో కలిశారు. దసరా పండుగ సందర్భంగా ఈ నెల 23న నిర్వహించనున్న అలైబలై కార్యక్రమానికి గవర్నర్ ను ఆహ్వానించేందుకే వచ్చానని విలేకరులకు తెలిపారు. ఇదే సమయంలో రాష్ట్ర పరిస్థితులపై తాము చర్చించినట్టు దత్తాత్రేయ చెప్పారు. రైతు ఆత్మహత్యలపై కేంద్ర ప్రభుత్వం ద్వారా సహాయం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని ఆయన అన్నారు.