: విజయ్ మాల్యా నివాసాలు, ఆఫీసుల్లో సీబీఐ సోదాలు
కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ అధినేత విజయ్ మాల్యాను కష్టకాలం వెంటాడుతోంది. ఇప్పటికే ఎయిర్ లైన్స్ వ్యవహారంలో పలు సమస్యల్లో ఉన్న ఆయన బ్యాంకింగ్ నిబంధనలు ఉల్లంఘించి రుణం పొందారని ఆరోపణలున్నాయి. దాంతో మాల్యా నివాసాలు, ఆఫీసుల్లో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. ముంబై, బెంగళూరు, గోవా, ఇంకా పలు చోట్ల అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఐడీబీఐ బ్యాంక్ నుంచి తీసుకున్న రూ.950 కోట్ల రుణానికి సంబంధించి ఈ తనిఖీలు జరుగుతున్నట్టు తెలిసింది.