: దర్శకుడితో అశ్వనీ దత్ కుమార్తె వివాహం


ప్రముఖ సినీ నిర్మాత అశ్వనీదత్ కుమార్తె ప్రియాదత్ వివాహం దర్శకుడు నాగ్ అశ్విన్ తో జరగనుంది. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాకు నాగ్ డైరెక్టర్ గా పనిచేశాడు. ఈ సినిమా సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందట. ఈ విషయాన్ని నాగ్ స్వయంగా వెల్లడించాడు. ప్రియాంకే తనకు ముందు ప్రపోజ్ చేసిందని, తాను సంతోషంగా అంగీకరించానని చెప్పాడు. సినీ కుటుంబం నుంచి వచ్చిన ప్రియ అమెరికాలో దర్శకత్వానికి సంబంధించిన శిక్షణ పొందింది. ఆ తర్వాత తమ బ్యానర్ నుంచి వస్తున్న సినిమాలను ఆమె పర్యవేక్షిస్తోంది. వీరి వివాహానికి ఇరు కుటుంబాల సభ్యులు అంగీకరించారు. పెళ్లి ముహూర్తం ఇంకా నిర్ణయించలేదని నాగ్ చెప్పాడు.

  • Loading...

More Telugu News