: వన్డేల్లో టీమిండియా ర్యాంక్ పదిలమేనా?


టీ20 ల్లో వైట్ వాష్ చేసి టీమిండియాను ఆరో ర్యాంకుకు పరిమితం చేసిన సౌతాఫ్రికా, వన్డేల్లోనైనా భారత్ కు నెంబర్ టూ ర్యాంకును ఉంచుతుందా? అనే సందేహం రేపుతోంది. సౌతాఫ్రికాకు కెప్టెన్ డివిలియర్స్, హషీమ్ ఆమ్లా, డుప్లెసిస్, డికాక్, డుమిని, మిల్లర్ తో నిలకడైన బ్యాటింగ్ లైనప్ తో పాటు మోర్నీ మోర్కెల్, డేల్ స్టెయిన్, ఆల్బీ మోర్కెల్, పార్నెల్ ఫిలాండర్, ఇమ్రాన్ తాహిర్ తో కూడిన బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగా ఉంది. భారత్ బ్యాటింగ్ లైనప్ కెప్టెన్ ధోనీ, ధావన్, రోహిత్, కోహ్లీ, రహానే, రైనా లతో బలంగా ఉన్నప్పటికీ, భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్, మోహిత్ శర్మ, అశ్విన్, హర్భజన్ లతో కూడిన బౌలింగ్ లైనప్ పై పెద్దగా అంచనాలు లేవు. టీమిండియా బ్యాట్స్ మన్ క్రీజులో కుదురుకుంటే భారీ స్కోరు ఖాయమే. కానీ సఫారీల బౌలింగ్ దాడి కుదురుకోనిస్తుందా? అదే సమయంలో భారత బౌలింగ్ దాడి సఫారీ బ్యాట్స్ మన్ ను సమర్ధవంతంగా అడ్డుకోగలుగుతుందా? అనే అనుమానాలు రేకెత్తిస్తోంది. కాగా, వన్డే సిరీస్ ను భారత్ కోల్పోతే, నెంబర్ టూ స్థానం చేజార్చుకుని నెంబర్ 3కి పడిపోతుంది. సఫారీలు ఓడితే వారి ర్యాంకులో పెద్దగా మార్పుండదు, కానీ గెలిస్తే మాత్రం 3వ స్థానం నుంచి రెండుకి ఎగబాకుతారు.

  • Loading...

More Telugu News