: అమెరికాపై తొడగొట్టిన ఉత్తర కొరియా
అగ్రరాజ్యం అమెరికాపై ఉత్తర కొరియా తొడగొట్టింది. అమెరికా తలపెట్టే ఎలాంటి యుద్ధాన్నైనా సరే తిప్పికొట్టేందుకు తమ బలగాలు సిద్ధంగా ఉన్నాయని ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ స్పష్టం చేశారు. అధికార వర్కర్స్ పార్టీ 70వ వార్షికోత్సవం సందర్భంగా రాజధాని ప్యాంగ్యాంగ్ లో భారీ ఎత్తున సైనిక కవాతును నిర్వహించారు. వేలాది మంది సైనికులు, ట్యాంకులతో ఈ వేడుక యుద్ధ సన్నాహాన్ని తలపించింది. ఈ సందర్భంగా కిమ్ జాంగ్ 30 నిమిషాల పాటు ప్రసంగించారు.