: గంటలసేపు ఇంటర్నెట్ లో గడిపే టీనేజర్లకు ఈ ముప్పు తప్పదు
ఇంటర్నెట్ వాడకం ఎక్కువైన ఈ రోజుల్లో అనారోగ్య సమస్యలు కూడా అదే స్థాయిలో పంజా విసురుతున్నాయి. ముఖ్యంగా టీనేజర్ల భవిష్యత్తుపై ఇంటర్నెట్ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. వారానికి 14 గంటలకు మించి ఇంటర్నెట్ వాడే టీనేజర్లు... భవిష్యత్తులో ఊబకాయం, హై బీపీ సమస్యలతో బాధపడతారని ఓ సర్వే తేల్చి చెప్పింది. 43 శాతం అబ్బాయిలు, 39 శాతం అమ్మాయిలకు ఈ ముప్పు పొంచి ఉందని సర్వే స్పష్టం చేసింది. ఇంటర్నెట్ వాడే సమయంలో టీనేజర్లు జంక్ ఫుడ్ తీసుకుంటారని, ఇది సమస్యను తీవ్రతరం చేస్తుందని డాక్టర్లు కూడా చెబుతున్నారు. సో... అవసరమైనంత మేరకే టీనేజర్లు ఇంటర్నెట్ కు పరిమితం కావాలి. శృతి మించితే భవిష్యత్తులో బాధపడక తప్పదు.