: నిలకడగా జగన్ ఆరోగ్యం... నాలుగో రోజుకు చేరిన ‘హోదా’ దీక్ష!
ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుంటూరులోని నల్లపాడులో చేపట్టిన నిరవధిక దీక్ష నేటికి నాలుగో రోజుకు చేరింది. నాలుగు రోజులుగా దీక్షలో కూర్చున్న జగన్ నీరసించినట్లు కనిపిస్తున్నారు. నాలుగు రోజులుగా ఆహారం ఏమీ తీసుకోకపోయినా జగన్ ఆరోగ్యం నిలకడగానే ఉందని గుంటూరు వైద్యులు ప్రకటించారు. దీక్షలో కూర్చున్న జగన్ కు కొద్దిసేపటి క్రితం వైద్యులు పలు రకాల పరీక్షలు చేశారు. నిన్నటిదాకా జగన్ ఆరోగ్యంలో ఎలాంటి మార్పు రాకున్నా, నేటి ఉదయం ఆయన బీపీ, షుగర్ లెవెల్స్ లో తేడాలు కనిపిస్తున్నాయని వైద్యులు చెప్పారు. జగన్ బరువు క్రమంగా తగ్గడం ప్రారంభమైందని తెలిపారు. నేటి సాయంత్రానికి జగన్ ఆరోగ్యం మరింత క్షిణించే అవకాశం ఉందని వైద్యులు పేర్కొన్నారు.