: నడి రోడ్డుపై దళితుల ‘నగ్న’ నిరసన... అరెస్ట్ చేసిన నోయిడా పోలీసులు


దేశ రాజధాని ఢిల్లీకి కూతవేటు దూరంలోని గ్రేటర్ నోయిడాలో నిన్న జరిగిన ఓ ఘటన కలకలం రేపుతోంది. తమ ఇంటిలో జరిగిన చోరీపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన దళిత కుటుంబానికి నోయిడా పోలీసుల నుంచి నిరాదరణే ఎదురైంది. తమకు సమయం లేదని పోలీసులు ముఖం మీదే చెప్పేశారట. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన దళిత కుటుంబం స్టేషన్ బయటకు వచ్చి వినూత్న నిరసనకు దిగారు. భార్యాభర్తలతో పాటు వారి వెంట వచ్చిన మరో ఇద్దరు యువతులు, ఓ యువకుడు నడిరోడ్డుపై ‘నగ్న’ నిరసనకు దిగారు. ఊహించని పరిణామానికి షాక్ తిన్న పోలీసులు వెనువెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు. తమ ఫిర్యాదును తీసుకోకపోగా, నిరసనకు దిగిన తమపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని బాధిత దంపతులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ తతంగాన్ని మొత్తం ఓ వ్యక్తి వీడియో తీసి నెట్ లో పెట్టేశాడు. ప్రస్తుతం ఈ వీడియో దృశ్యాలు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఇదిలా ఉంటే, ఈ దృశ్యాలు బయటకు రానంతవరకు బాధిత కుటుంబం వితండ వాదనకు దిగినట్లు సమాచారం. చోరీపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన తమపై ఓ స్థాయిలో దాడికి దిగిన పోలీసులు తమను వివస్త్రలను చేశారని ఆరోపించారు. అయితే వీడియో దృశ్యాలు బయటకు రావడంతో వారు మాట మార్చేశారు. తమ నుంచి ఫిర్యాదు తీసుకుని ఉంటే, నిరసనకు దిగాల్సిన అవసరం తమకేంటని వారు ప్రశ్నించారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని నోయిడా ఎస్ఎస్పీ కిరణ్ చెప్పారు.

  • Loading...

More Telugu News