: సౌరాష్ట్రను గెలిపించి 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'గా నిలిచిన జడేజా


సౌరాష్ట్రను విజయపథాన నిలిపి, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా రవీంద్ర జడేజా నిలిచాడు. టీమిండియాలో చోటు కోల్పోయిన జడేజా రంజీల్లో విజృంభించాడు. జార్ఖండ్ తో జరిగిన మ్యాచ్ లో జడేజా విశేషంగా రాణించడంతో నాలుగు రోజులు జరగాల్సిన మ్యాచ్ రెండు రోజుల్లోనే పూర్తయింది. త్రిపురతో జరిగిన తొలి మ్యాచ్ లో 11 వికెట్లతో రాణించిన జడేజా, జార్ఖాండ్ తో జరిగిన మ్యాచ్ లో 13 వికెట్లు తీసి భళా అనిపించాడు. అలాగే, తొలి ఇన్నింగ్స్ లో 58 పరుగులు చేయడంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. తొలి ఇన్నింగ్స్ లో 168 పరుగులు చేసిన జార్ఖాండ్ జట్టు రెండో ఇన్నింగ్స్ లో జడేజా విజృంభణకు 122 పరుగులకే చాపచుట్టేశారు. తొలి ఇన్నింగ్స్ లో 37 పరుగుల ఆధిక్యం లభించిన సౌరాష్ట్ర, రెండో ఇన్నింగ్స్ ను కేవలం రెండు వికెట్లు కోల్పోయి ముగించింది. దీంతో కేవలం రెండు రోజుల్లోనే సౌరాష్ట్ర విజయం సాధించింది.

  • Loading...

More Telugu News