: కడపలో మాకు టిఫిన్ పెట్టారని డీలర్ కు నోటీసులిచ్చారు: సోము వీర్రాజు


కడపలో బీజేపీ నేతలకు టిఫిన్ పెట్టారనే కారణంగా రేషన్ షాపు డీలర్ కు అధికారులు నోటీసులు ఇచ్చారని ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేత సోము వీర్రాజు ఆరోపించారు. ఏపీలో బీజేపీ, టీడీపీ మధ్య వివాదం రాజుకుంటోందా? అంటూ ఓ టీవీ ఛానెల్ నిర్వహించిన డిబేట్ లో ఆయన మాట్లాడుతూ, తమ రెండు పార్టీల మధ్య విభేదాలు లేవని అన్నారు. అయితే ఈ మధ్య కడపలో క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లిన సందర్భంగా ఓ రేషన్ షాపు డీలర్ తమకు అల్పాహారం పెట్టాడని, తాము అక్కడి నుంచి వెళ్లిన వెంటనే అధికారులు నోటీసులు ఇచ్చారని ఆయన తెలిపారు. తరువాత తమ పార్టీ నేతలు కలెక్టర్ తో మాట్లాడి నోటీసులు ఉపసంహరించేలా చేశారని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News