: కాన్పూర్ మ్యాచ్ కు భారీ భద్రత...వేషాలేస్తే తాట తీస్తారు!
కటక్ టీట్వంటీ బీసీసీఐకి గట్టి పాఠమే నేర్పింది. ఆ గుణపాఠంతో కాన్పూర్ వన్డేకి బీసీసీఐ గట్టి భధ్రతను ఏర్పాటు చేయనుంది. సీఐఎస్ఎఫ్ కు చెందిన 12 కంపెనీలకు చెందిన భద్రతా బలగాలతో పహారా కాయనున్నారు. స్టేడియం లోపల, బయట 3 వేల మంది సిబ్బందితో భద్రత పర్యవేక్షించనున్నారు. అలాగే ఆటగాళ్లు ఉండే హోటల్ నుంచి స్టేడియం వరకు 18 జోన్లు, 45 సెక్టార్లుగా విభజించి భద్రతా చర్యలు చేపట్టారు. అలాగే ప్రేక్షకులు సన్ గ్లాసెస్, మొబైల్ ఫోన్స్ మినహా ఇంకే రకమైన వస్తువులు తీసుకెళ్లినా పోలీసులు అనుమతించరు. స్టేడియంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెద్ద సంఖ్యలో స్టేడియంలో సీసీ కెమేరాలు అమర్చారు. అభిమానులు అత్యుత్సాహంతో ఎలాంటి దుందుడుకు పనులు చేసినా తగిన చర్యలు ఉంటాయని స్పష్టం చేస్తున్నారు.