: సౌదీలో భారతీయ మహిళ చెయ్యి నరికేసిన యజమాని... మంత్రి సుష్మాస్వరాజ్ ఖండన
తన ఇంట్లో పనిచేస్తున్న భారతీయ మహిళ చేతిని యజమాని నరికివేసిన దారుణ సంఘటన సౌదీలో చోటుచేసుకుంది. కస్తూరి మునిరత్నం (55)ను యజమాని చిత్రహింసలు పెడుతుండటంతో ఆమె తప్పించుకునే ప్రయత్నం చేసింది. దీంతో ఆమె కుడిచేతిని యజమాని నరికివేసినట్లు బాధితురాలి కుటుంబసభ్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె సౌదీలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కాగా, ఈ సంఘటనను విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ ఖండించారు. ఒక భారతీయ మహిళను ఇంత దారుణంగా హింసించడం తనను తీవ్రంగా బాధించిందని సుష్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి సంఘటనలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించలేమన్నారు. బాధితురాలితో సౌదీలో ఉన్న భారత రాయబార కార్యాలయం సంప్రదింపులు జరుపుతోందని, ఆ యజమానిపై హత్యా నేరం కింద కేసు నమోదు చేయాలని భారత్ ప్రభుత్వం ఇప్పటికే డిమాండ్ చేసిందని సుష్మా స్వరాజ్ చెప్పారు.