: కిషన్ రెడ్డికి సవాల్ విసిరిన కేటీఆర్
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి టీఎస్ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. కిషన్ రెడ్డికి నిజంగా పలుకుబడి ఉంటే... కేంద్రం నుంచి తెలంగాణకు రూ. లక్ష కోట్ల ప్యాకేజీ తీసుకురావాలని ఛాలెంజ్ చేశారు. బీహార్ కు ప్యాకేజీ ఇచ్చినప్పుడు, తెలంగాణకు ఎందుకివ్వరని ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు మాత్రమే మోదీ ప్రధానమంత్రా? అని విమర్శించారు. ఈ రోజు మెదక్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రైతు ఆత్మహత్యలపై బీజేపీతో పాటు అన్ని పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. విపక్ష నేతలు ఎవరూ కూడా రైతు బంధువులు కాదని... రాబందులని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.