: ఇది ప్రపంచ రికార్డు ... వేలంలో అత్యధిక ధరలకు అమ్ముడైన నగలు!
ప్రపంచ వ్యాప్తంగా వేలంలో అత్యధిక ధరలకు అమ్ముడైన రెండు నగలు రికార్డు నెలకొల్పాయి. ఆ రెండు నగలు ఏమిటంటే.. ఒకటి అరుదైన కాశ్మీరీ వజ్రపుటుంగరం, మరొకటి ఒక బ్రిటిష్ దొరకు చెందిన గోధుమరంగు ముత్యాల హారం. నీలంరంగు కాశ్మీరి వజ్రపుటుంగరానికి వేలంలో పలికిన ధర 52.28 హాంకాంగ్ మిలియన్ డాలర్లు. మన కరెన్సీలో చెప్పాలంటే సుమారు రూ.43 కోట్లకు పైమాటే. గోధుమ రంగు ముత్యాల హారానికి వేలంలో 41 హాంకాంగ్ బిలియన్ డాలర్లు పలికింది. ఇది సుమారు రూ.34 కోట్లకు సమానం. కాశ్మీరీ ఉంగరాన్ని, గోధుమ రంగు ముత్యాలహారాన్ని వేలంలో ఎవరు దక్కించుకున్నారనే విషయం మాత్రం బయటకు రాలేదు. హాంకాంగ్ లోని సోత్ బే ఆక్షన్ హాల్లో జరిగిన ఈ వేలం పాటకు డబ్బున్న మారాజులు దండిగానే వచ్చారు.