: అనంత పద్మనాభస్వామి సంపదను మళ్లీ తనిఖీ చేసేందుకు సుప్రీంకోర్టు ఆదేశం


కేరళలోని శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయ నేళ మాళిగలో లభించిన లక్ష కోట్లకుపైగా విలువైన సంపదను మరోసారి తనిఖీ చేసేందుకు సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. ఈ మేరకు రెండోసారి తనిఖీ చేయాలంటూ మాజీ కాగ్ వినోద్ రాయ్ ని చీఫ్ జస్టిస్ హెచ్ఎల్ దత్తూతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. ఏడాదిన్నర కిందట తాను చేసిన ఆడిట్ పై వినోద్ రాయ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. దాంతో అవకాశం ఉంటే మళ్లీ తనిఖీలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నానని కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో సంపద తనిఖీ చేసేందుకు ఆయనకు కోర్టు అనుమతించింది.

  • Loading...

More Telugu News