: విపక్షాల బంద్ కు ప్రజల మద్దతు లేదు: పోచారం
రైతు సమస్యలపై టీఆర్ఎస్ ప్రభుత్వ అలసత్వాన్ని నిరసిస్తూ తెలంగాణలోని విపక్షాలన్నీ కలసి రేపు రాష్ట్రవ్యాప్త బంద్ చేపట్టాయి. బంద్ ను విజయవంతం చేయాలని విపక్ష నేతలంతా పట్టుదలగా ఉన్నారు. ఈ బంద్ కార్యక్రమంపై టీఎస్ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. విపక్షాల బంద్ ను బలవంతపు బంద్ గా ఆయన అభివర్ణించారు. బంద్ కు ప్రజల మద్దతు ఎంతమాత్రం లేదని ఆయన అన్నారు. ప్రజల సహకారం లేకుండా నిర్వహించే బంద్ ఎలా బంద్ అవుతుందని ఆయన ప్రశ్నించారు.