: పురుషులు గరిటపట్టే సమయం వచ్చిందంటున్న చంద్రబాబు


ఆడవాళ్లు అన్ని రంగాల్లో రాణిస్తూ దూసుకుపోతున్న వేళ, ఇండ్లలో పురుషులు గరిట పట్టి వంట చేయాల్సిన సమయం వచ్చిందని, వంటలెలా చేయాలో మగవాళ్లు నేర్చుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఛలోక్తి విసురుతూ సలహా ఇచ్చారు. ఈ ఉదయం విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగించిన ఆయన, తాను చైనా పర్యటించినప్పుడు జరిగిన ఓ ఘటనను గుర్తు చేసుకున్నారు. చైనా పర్యటనలో భాగంగా తాను ఓ నగర మేయర్ ను కలుసుకున్నానని, అతని భార్య కన్నా ఆయనే రుచికరమైన వంటలను తయారు చేస్తున్నాడని తెలిపారు. ఆ మేయర్ తన ఇంట భోజనం చేయాలని ఆహ్వానించినట్టు తెలిపారు. చంద్రబాబు ఇంకా ఏమన్నారో ఈ వీడియోను చూస్తే మీక్కూడా తెలుస్తుంది.

  • Loading...

More Telugu News