: అవినీతి పరుడైన జగన్ తో బీజేపీ ఎన్నటికీ కలవదు: మంత్రి కామినేని
శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ మేరకు ప్రభుత్వ గ్రామీణ ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జగన్ దీక్షపై మంత్రి మాట్లాడుతూ, రాజకీయ ఉనికిని చాటుకునేందుకే ఆయన దీక్షలు చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ, టీడీపీని విడదీసేందుకు జగన్ కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. అవినీతి పరుడైన జగన్ తో బీజేపీ ఎన్నటికీ కలవదని స్పష్టం చేశారు. హోదాపై దీక్ష చేస్తున్న జగన్, రాష్ట్రానికి కేటాయించిన నిధులపై ఎందుకు మాట్లాడరని కామినేని ప్రశ్నించారు.