: అమరావతికీ ‘స్మార్ట్’ హోదా... ప్రత్యేక కేటగిరీగా పరిగణిస్తామన్న వెంకయ్య


నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణమే మొదలు కాలేదు. అప్పుడే స్మార్ట్ సిటీ హోదా దక్కింది. కేంద్రంలో నరేంద్ర మోదీ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత నగరాలను మరింత అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ‘స్మార్ట్ సిటీ’ పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం కింద ఏపీలో విశాఖతో పాటు కాకినాడ, తిరుపతి నగరాలను స్మార్ట్ సిటీలుగా తీర్చిదిద్దనున్నట్లు ఇటీవల కేంద్రం ప్రకటించింది. తాజాగా కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు నవ్యాంధ్ర రాజధాని అమరావతికి కూడా స్మార్ట్ సిటీ పథకాన్ని వర్తింపజేస్తామని ప్రకటించారు. స్మార్ట్ సిటీల ఎంపిక ఇప్పటికే పూర్తైనా, అమరావతి విషయాన్ని ప్రత్యేక కేటగిరీగా పరిగణిస్తామని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News