: రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకుంటున్న కేసీఆర్ కుటుంబం: కాంగ్రెస్ ఫైర్


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులపై టీకాంగ్రెస్ నేతలు నిప్పులు చెరిగారు. కేసీఆర్, ఆయన కుమారుడు, కుమార్తె, అల్లుడు తెలంగాణను నిలువునా దోచుకుంటున్నారని కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, జానారెడ్డి, షబ్బీర్ అలీ, మధుయాష్కీ, డీకే అరుణ, జీవన్ రెడ్డిలు ఆరోపించారు. తన కుటుంబ అధికారమే కేసీఆర్ కు కావాలని మండిపడ్డారు. ఫామ్ హౌస్ ను ఓపెన్ చేస్తే, కేసీఆర్ వ్యవసాయం ఎలా చేస్తున్నారనే విషయాన్ని రైతులు నేర్చుకుంటారని ఎద్దేవా చేశారు. రైతుల ఆత్మహత్యలను పట్టించుకోని కేసీఆర్... ఉప ఎన్నికలు, పదవుల పంపకాలపై చర్చలు జరుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ హానీమూన్ ముగిసిందని అన్నారు.

  • Loading...

More Telugu News