: బెజవాడలో కొత్త దందా ‘కాల్ మనీ’...తల్లి వడ్డీ చెల్లించలేదని కూతురును అమ్మేశారట!


నవ్యాంధ్రప్రదేశ్ రాజకీయ రాజధానిగా రూపుదిద్దుకుంటున్న విజయవాడలో కొత్త దందా జడలు విప్పింది. ‘కాల్ మనీ’ పేరిట రంగప్రవేశం చేసిన ఈ నయా దందాలో వంద రూపాయల అప్పు తీసుకుంటే నెలకు రూ.30 వడ్డీ చెల్లించాల్సి ఉంటుందట. ఈ తరహా నయాదందాలో ‘సెవెన్ సిస్టర్స్’ పేరిట నగరంలో వెలసిన ఓ సంస్థ తనదైన శైలిలో అరాచకాలకు పాల్పడుతోంది. డబ్బు అవసరమైన వ్యక్తులను గుర్తించి అప్పటికప్పుడే రుణాలిచ్చేస్తున్న ఆ సంస్థ నిర్వాహకులు ఆ తర్వాత తమ నిజ స్వరూపాన్ని బయటకు తీస్తున్నారు. నగరంలోని రాజరాజేశ్వరినగర్ కు చెందిన సత్యవతి అనే మహిళ ఈ సంస్థ వద్ద తీసుకున్న రుణానికి సంబంధించిన వడ్డీ చెల్లింపులో కాస్తంత వెనుకబడిందట. దీంతో రంగప్రవేశం చేసిన ‘సెవెన్ సిస్టర్స్’ దుర్మార్గులు ఆమె కూతురును అపహరించారు. అంతటితో ఆగకుండా అపహరించిన బాలికను వేశ్యాగృహాలకు అమ్మేశారట. సెవెన్ సిస్టర్స్ నిర్వాహకులపై సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రూ.20 వేలు అప్పుగా తీసుకున్నందుకు తన కొడుకుతోనూ కూలీ పని చేయిస్తున్నారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నయా దందారాయుళ్లను అరెస్ట్ చేసేందుకు రంగంలోకి దిగారు.

  • Loading...

More Telugu News