: సిటీ బస్సులోనే ప్రసవించిన మహిళ
సిటీ బస్సులోనే ఓ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన హైదరాబాద్ లోని కోఠి వద్ద జరిగింది. వివరాల్లోకి వెళితే, ఐడీఏ బొల్లారంకు చెందిన గర్భిణిని ప్రసవం కోసం కోఠిలోని ఆసుపత్రికి సిటీ బస్సులో తీసుకువస్తున్నారు. కోఠిలోని ఆంధ్రాబ్యాంక్ వద్దకు రాగానే ఆమెకు పురుటి నొప్పులు ఎక్కువై, బస్సులోనే ప్రసవించింది. బస్సులో ఉన్న తోటి మహిళలు ఈ సందర్భంగా సహకరించారు. తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగానే ఉన్నారు. అనంతరం, వీరిని కోఠిలోని ప్రసూతి ఆసుపత్రికి తీసుకెళ్లారు.