: నాన్న పేరు వింటే రక్తం పొంగుతుంది...తెలుగంటే తనువు పులకిస్తుంది: బాలయ్య ఆసక్తికర కామెంట్స్


టాలీవుడ్ అగ్ర నటుడు, అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నిన్న రాత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాదులో నిన్న రాత్రి జరిగిన ఓ తెలుగు సినిమా ఆడియో వేడుకలో పాల్గొన్న సందర్భంగా ఆయన తన తండ్రి స్వర్గీయ నందమూరి తారకరామారావును గుర్తు చేసుకున్నారు. అదే సమయంలో ఎన్టీఆర్ ఎలుగెత్తి చాటిన తెలుగు వెలుగును కూడా బాలయ్య ప్రస్తావించారు. ‘‘మన సంస్కృతి, సంప్రదాయాలంటే నాకు చాలా గౌరవం. మా నాన్నగారు ఎన్టీఆర్ పేరు వింటే నా రక్తం పొంగుతుంది. తెలుగంటే తనువు పులకిస్తుంది’’ అని బాలయ్య వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News