: ‘శారదా’ నిందితులకు గోస్వామి దన్ను!.... రంగంలోకి దిగిన కేంద్ర నిఘా వర్గాలు


నిన్నటిదాకా కేంద్ర హోం శాఖ కార్యదర్శిగా కీలక భూమిక పోషించిన అనీల్ గోస్వామి ఆ పదవి నుంచి దిగిపోగానే చిక్కుల్లో పడ్డారు. పశ్చిమ బెంగాల్ రాజకీయాలను ఓ కుదుపు కుదిపేసిన శారదా చిట్ ఫండ్ కుంభకోణం నిందితులను హోం శాఖ కార్యదర్శి హోదాలో ఆయన కాపాడారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కుంభకోణంలో ప్రధాన నిందితుడు, కేంద్ర మాజీ మంత్రి మాతంగ్ సింగ్ అరెస్ట్ కాకుండా గోస్వామి తెర వెనుక కథ నడిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మాతంగ్ సింగ్ ను అరెస్ట్ చేయకుండా గోస్వామి ఏకంగా సీబీఐ అధికారులనే మేనేజ్ చేశారట. ఈ ఆరోపణల ఆధారంగానే గోస్వామి హోం శాఖ కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై దృష్టి సారించిన కేంద్ర నిఘా విభాగం గుట్టుచప్పుడు కాకుండా నిజాలు వెలికితీస్తోందన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. మాతంగ్ ను గోస్వామి రక్షించారన్న విషయంలో ఇప్పటికే తమకు కొన్ని కీలక ఆధారాలు లభ్యమయ్యాయని కూడా కేంద్ర నిఘా విభాగానికి చెందిన ఓ కీలక అధికారి చెబుతున్నారు.

  • Loading...

More Telugu News