: లండన్ క్యాసినోలో రాధేమా చిందులు... కలకలం రేపుతున్న కొత్త వీడియో


వివాదాస్పద ఆధ్మాత్మిక గురువు రాధేమా కు చెందిన ఓ కొత్త వీడియో ప్రస్తుతం నెట్ లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే పొట్టి స్కర్టులు వేసుకున్న ఆమె చిత్రాలు వెలుగులోకి రావడంతో పాటు వరకట్న వేధింపుల కేసు కూడా ఆమెపై నమోదైంది. ఈ కేసులో అరెస్ట్ నుంచి ఆమెకు ఉపశమనం కల్పిస్తూ బాంబే హైకోర్టు నిన్న తీర్పు చెప్పింది. ఈ క్రమంలో నిన్న నెట్ లో ఓ కొత్త వీడియో ప్రత్యక్షమైంది. సదరు వీడియోలో రాధేమా ఫ్యాషన్ దుస్తుల్లో చిందులేస్తూ కనిపించింది. ‘లండన్ క్యాసినోలో రాధేమా చిందులు’ పేరిట విడుదలైన ఆ వీడియో నెట్ లో చక్కర్లు కొడుతోంది.

  • Loading...

More Telugu News