: దుబాయ్ రాజకుటుంబాన్ని కలవనున్న సన్నీ లియోన్


సన్నీ లియోన్.. ఈ నీలి చిత్రాల తార ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ గాళ్. 'జిస్మ్-2'తో సినీ ఎంట్రీ ఇచ్చిన సన్నీ లియోన్ అనంతరం 'రాగిణి ఎంఎంఎస్-2'లో చాన్సు దక్కించుకుంది. అంతేగాకుండా, తాజాగా 'షూటౌట్ ఎట్ వడాలా' చిత్రంలో ఓ ఐటమ్ సాంగ్ లోనూ తళక్కుమంది. కాగా, ఆ సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా సన్నీ లియోన్ దుబాయ్ రాజకుటుంబాన్ని కలవనుంది. త్వరలోనే ఈమెతో పాటు సినిమా తారాగణం జాన్ అబ్రహాం, అనిల్ కపూర్, మనోజ్ బాజ్ పాయి, తుషార్ కపూర్, సోఫీ చౌదరి కూడా దుబాయ్ రాయల్ ఫ్యామిలీ ఆతిథ్యం స్వీకరించనున్నారు.

  • Loading...

More Telugu News