: టీఎన్జీవో కార్యాలయానికి అశోక్ బాబు... సాదరంగా ఆహ్వానించిన టీ ఉద్యోగులు


ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం, ఆ తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించడం, ఉద్యోగుల విభజనపై పీటముడి నేపథ్యంలో హైదరాబాదులో సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంది. అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న ఏపీఎన్జీఓ, టీఎన్జీవో భవనాల వద్ద కూడా ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. విద్యుత్ సౌధ, బీఆర్కే భవన్, సచివాలయం తదితర ప్రాంతాల్లో ఈ తరహా పరిస్థితులు మరింత దారుణంగా కనిపించాయి. ఇక హైదరాబాదులోని ఏపీఎన్జీవోల కార్యాలయం తమదంటే తమదని ఇరు రాష్ట్రాల ఉద్యోగ సంఘాలు వాదులాడుకున్నాయి. ఒకానొక సందర్భంలో కార్యాలయానికి తాళాలు కూడా పడ్డాయి. ఈ క్రమంలో ఇరు రాష్ట్రాల ఉద్యోగ సంఘాల నేతల మధ్య సఖ్యత చెడింది. ఈ నేపథ్యంలో ఏపీఎన్జీవో అధ్యక్షుడు నిన్న టీఎన్జీవోస్ భవన్ లో ప్రత్యక్షమయ్యారు. అక్కడ టీఎన్జీవో నేతలు ఆయనను సాదరంగా ఆహ్వానించారు. ఎంతైనా మొన్నటిదాకా ఒకేచోట కలిసి మెలసి పనిచేసిన అశోక్ బాబు, టీఎన్జీవో హైదరాబాదు జిల్లా అధ్యక్షుడు ముజీబ్ హుస్సేనీ ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఈ సందర్భంగా టీఎన్జీవోస్ హైదరాబాదు జిల్లా శాఖ నిర్వహణ బాగుందని అశోక్ బాబు కితాబిచ్చారు.

  • Loading...

More Telugu News