: ఒత్తిడి తగ్గించుకునేందుకు.. సులువైన మార్గం ఇది‘గో’!
ఒత్తిడి తగ్గించుకునేందుకు నానా ప్రయత్నాలు చేస్తుంటాం. కానీ, దాని నుంచి బయటపడే పని మన చేతుల్లోనే ఉందట. అందుకని ఎక్కడికి వెళ్లక్కర్లేదు. కిచెన్ లోని పాత్రలు తోమితే చాలట! దీని వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం లభించడమే కాకుండా, క్రమంగా దాని నుంచి దూరమవుతామని పరిశోధకుల తాజా అధ్యయనం చెబుతోంది. పాత్రలు తోమేటప్పుడు శుభ్రంగా ఉండాలనే శ్రద్ధతో ఉంటాము. దానివల్ల ఒత్తిడి క్రమంగా తగ్గుతుందట. కేవలం గిన్నెలు తోమడమే కాదు.. ఇంటి పనులేవి చేసినా మన ఒత్తిడి తగ్గుతుందంటున్నారు పరిశోధకులు.