: రంజీలో రెచ్చిపోయిన జడేజా


టీమిండియాలో చోటు కోల్పోయిన రవీంద్ర జడేజా రంజీల్లో రాణిస్తున్నాడు. జార్ఖండ్ తో జరిగిన మ్యాచ్ లో ఆల్ రౌండ్ షోతో ఆకట్టుకున్నాడు. గ్రూప్ సీలో భాగంగా రాజ్ కోట్ లో జరుగుతున్న మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన జార్ఖండ్ జట్టు జడేజా ధాటికి 168 పరుగుల స్వల్ప స్కోరుకే ఆలౌట్ అయింది. 6 వికెట్లు తీసిన జడేజా ప్రత్యర్థికి చుక్కలు చూపించాడు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన సౌరాష్ట్ర జట్టు ఆదిలోనే వికెట్లు కోల్పోవడంతో బరిలో దిగిన జడేజా (58) అర్ధ సెంచరీతో జట్టును ఒడ్డున పడేశాడు. దీంతో 205 పరుగులకు ఆలౌట్ అయిన సౌరాష్ట్రకు 37 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. కాగా, టీమిండియాలో అర్హతకు మించి జడేజాకు అవకాశాలు కల్పిస్తున్నాడంటూ ధోనీపై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేఫథ్యంలోనే సెలెక్టర్లు జడేజాకు ఉద్వాసన పలికారు. తాజా ప్రదర్శనతో మరోసారి టీమిండియాలో చోటు ఖాయం చేసుకునే దిశగా జడేజా అడుగులు వేస్తున్నాడు.

  • Loading...

More Telugu News