: కోట్లు పలికిన ముత్యాలు పొదిగిన పురాతన పళ్లెం!


ముత్యాలతో తయారు చేసిన ఈ పురాతన పళ్లెం వేలంపాటలో 9,62,500 పౌండ్లకు అమ్ముడుపోయింది. అదే మన కరెన్సీలో అయితే దాని విలు రూ.9.56 కోట్లు. గుజరాత్ కు చెందిన 16వ శతాబ్దపు నాటి ఈ పళ్లాన్ని ఈ నెల 6న ఇస్లామిక్, భారతీయ కళాకృతుల అమ్మకంలో భాగంగా లండన్ లో బోన్ హామ్ సంస్థ వేలం వేసింది. మొదట ఊహించిన దానికంటే పదిరెట్లు అధికంగా ఈ పళ్లానికి ధర లభించింది. ఈ పళ్లెంలో పర్షియన్, భారతీయ, యూరోపియన్ సంస్కృతుల మిశ్రమ కళాకృతి స్పష్టంగా కనపడుతుంది.

  • Loading...

More Telugu News