: ప్రతిపక్ష నాయకుడిగా జగన్ పనికిరాడు: ఉపముఖ్యమంత్రి కేఈ
వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ ప్రతిపక్ష నాయకుడిగా పనికిరాడని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తీవ్రంగా విమర్శించారు. కర్నూల్ జిల్లాలోని కృష్ణగిరి జలాశయం నుంచి కాలువలకు గురువారం నీటిని విడుదల చేసిన అనంతరం ఆయన బహిరంగసభలో మాట్లాడారు. పట్టిసీమ పథకానికి అడ్డుపడిన జగన్ ప్రత్యేక హోదా కోసం దీక్ష చేయడం విడ్డూరంగా ఉందని కేఈ కృష్ణమూర్తి అన్నారు. మరోమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, రాయలసీమ రాళ్ల సీమ కాదని, రతనాల సీమని అన్నారు.